ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేలా పురపాలికలకు ఏపీ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. లక్ష లోపు జనాభా గల మున్సిపాలిటీలకు రూ. 5 కోట్ల చొప్పున రుణాలు అందించేందుకు ప్రణాళికలు రూపొందించింది. క్రెడిట్ ఎన్‌హాన్స్‌మెంట్ స్కీం కింద పది మున్సిపాలిటీలను ఇప్పటికే ఎంపిక చేసింది. ఈ నిధులతో ఆయా పట్టణాల్లో షాపింగ్ కాంప్లెక్స్‌లు, మార్కెట్లు నిర్మించి అద్దెకు ఇవ్వడం ద్వారా అదనపు ఆదాయం సమకూర్చుకోవచ్చు. మొదటి దశలో భాగంగా దీన్ని పది పట్టణాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు.