ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ పరిశ్రమకు కూటమి ప్రభుత్వం.. తాజాగా భూమిని కేటాయించింది. రిలయన్స్ కంపెనీ రూ.1622 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ కంపెనీతో ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగాలు లభిస్తాయని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. తాజాగా సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ రిలయన్స్ ప్రాజెక్టు కోసం 80 ఎకరాల భూమిని కేటాయించారు. వచ్చే ఏడాది డిసెంబర్‌లోగా ఉత్పత్తి ప్రారంభించాలని రిలయన్స్‌ను ప్రభుత్వం ఆదేశించింది.