ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక. ఆదివారం కొన్నిచోట్ల వర్షాలు పడనున్నాయి. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. అలాగే ఆగస్ట్ 25వ తేదీ నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఇక వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నదుల్లో వరద ప్రవాహం కూడా తగ్గుతోందని వెల్లడించింది.