Andhra Pradesh Wheat Flour Rs 18 Per Kg: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు శుభవార్త అందించింది. జనవరి 1 నుంచి బియ్యంతో పాటు రాగులు, గోధుమ పిండి కూడా రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ కొత్త సరుకుల పంపిణీకి కేంద్రం అంగీకారం తెలిపింది. జనవరి నుంచి బియ్యం బస్తాలపై క్యూఆర్ కోడ్ ట్యాగ్‌ల ద్వారా పంపిణీ చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు.