Railway Coach Factory Near Tirupati: ఏపీలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుపతి జిల్లాలోని చంద్రగిరి సమీపంలో ఉన్న పాకాల రైల్వే స్టేషన్ అభివృద్ధితో పాటుగా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని తాను రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసినట్లు తెలిపారు. ఆయన సానుకూలంగా స్పందించి ఫ్యాక్టరీ ఏర్పాటుపై హామీ ఇచ్చినట్లు తెలిపారు. పాకాల రైల్వే స్టేషన్ అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే ఉత్తర్వులు వచ్చాయన్నారు.