ఏపీలో రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. నెల్లూరు, అనకాపల్లి మీదుగా కొత్త రైళ్లు..!

1 month ago 6
దక్షిణ మధ్య రైల్వే (SCR) బెంగళూరు- బాలూర్‌ఘాట్ మధ్య రెండు కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించింది. జనవరి 21 నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ సర్వీసులు.. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, అనకాపల్లి మీదుగా వెళ్తున్నాయి. దీంతో ఈ ప్రాంత వాసులకు మరో రెండు సర్వీసులు అందుబాటులోకి వచ్చినట్లు అయింది. ఎస్‌ఎంటీవీ బెంగళూరు- బాలూర్‌ఘాట్‌ రైలు ప్రతి బుధవారం 10.15 గంటలకు బెంగళూరు నుంచి ప్రారంభం అవుతుంది. నెల్లూరు, అనకాపల్లి, శ్రీకాకుళం మీదుగా బెంగాల్‌లోని బాలూర్‌ఘాట్‌‌కు చేరుకుంటుంది. శనివారం అక్కడి నుంచి బయలుదేరి సోమవారం ఉదయం 3.00 గంటలకు బెంగుళూరుకు చేరుకుంటుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు.
Read Entire Article