Obulavaripalli Krishnapatnam Railway Line: ఆంధ్రప్రదేశ్‌లో సరికొత్త రైలు మార్గం ప్రారంభమైంది! దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా 7.5 కిలోమీటర్ల పొడవైన సొరంగం నిర్మించారు. నెల్లూరు, అన్నమయ్య జిల్లాల సరిహద్దుల్లోని ఈ మార్గం సరుకు రవాణాకు ఎంతో ఉపయోగపడుతుంది. త్వరలోనే ప్యాసింజర్ రైళ్లు కూడా నడవనున్నాయి. ఈ రైలు మార్గం రాయలసీమ, కోస్తా ప్రాంతాలను కలుపుతూ ప్రయాణికులకు కొత్త అనుభూతిని అందించనుంది. ఈ రైలు మార్గం వెనుక ఎన్నో ఏళ్ల కృషి ఉంది.