AP High Court On Lulu Mall Land Allocation: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లులు మాల్ భూ కేటాయింపు వ్యవహారం చిక్కులు తెచ్చిపెట్టింది. విశాఖ, విజయవాడల్లో భూ కేటాయింపు జీవోను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. గతంలో కేటాయింపు రద్దు చేసి, మళ్ళీ బిడ్లు లేకుండానే కేటాయించారని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. విజయవాడలోనూ భూ కేటాయింపునకు ప్రభుత్వం అంగీకరించడంపై సవరణ పిటిషన్ దాఖలుకు కోర్టు అనుమతించింది.