Andhra Pradesh Rains ఏపీలో మరోసారి వర్షాలు ఊపందుకుంటున్నాయి. సోమవారం నుంచి జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభఆవంతో వానలు కురుస్తున్నాయి. ఈ ప్రభావంతో మరో మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వానలు కురుస్తాయంటున్నారు. కొన్ని చోట్ల మధ్యాహ్నం వరకు ఎండ ప్రభావం కనిపించగా.. ఆ తర్వాత వాతావరణం చల్లబడి వర్షం పడింది.