Compassionate Appointments In APSRTC: ఆర్టీసీ పాలకవర్గం సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. భవిష్యత్తులో విద్యుత్ బస్సులనే కొనాలని, బస్టాండ్లలో మౌలిక వసతులు కల్పించాలని నిర్ణయించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలుకు చర్యలు చేపట్టాలని తీర్మానించారు. అంతేకాకుండా, ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 7 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరనున్నారు. ఏపీఎస్ ఆర్టీసీ పాలకవర్గం ఉద్యోగుల సంక్షేమం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.