ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థలో వినూత్న మార్పులు తీసుకువస్తోంది కూటమి ప్రభుత్వం. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పేరెంట్ టీచర్స్ మీటింగ్స్‌ల్లో భాగంగా మన్యం జిల్లా బామినిలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'కలలకు రెక్కలు' పథకం కింద.. విదేశీ విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు పావలా వడ్డీతో రుణాలు అందిస్తామన్నారు. అంతేకాకుండా ప్రతిభావంతులను ప్రోత్సహించడానికి 'షైనింగ్ స్టార్స్' కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. కాగా, విద్యార్థులకు అత్యాధునిక విద్య అందించడానికి ఉపాధ్యాయులకు విదేశీ శిక్షణ కూడా ఇస్తున్నామన్నారు.