ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. సమగ్ర శిక్షా అభియాన్ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమ్మె కాలానికి వేతనాలు విడుదల చేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది ఆఖర్లో డిమాండ్ల సాధన కోసం వీరంతా సమ్మె చేశారు. 21 రోజుల పాటు సమ్మె కొనసాగింది. అయితే ఈ సమ్మె కాలానికి వేతనాలు విడుదల చేయాలంటూ సమగ్ర శిక్షా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ మంత్రి నారా లోకేష్‌ను కలిసి కోరింది. ఆయన ఆదేశాల మేరకు వేతనాల చెల్లింపునకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.