ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేవాలయాల్లోని అర్చకులకు కనీస వేతనం పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆలయాల్లోని అర్చకులకు కనీస వేతనంగా రూ.15000 అందించనున్నారు. ఈ విషయాన్ని ఏపీ దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి వెల్లడించారు. అయితే ఆదాయం రూ.50000 దాటిన ఆలయాల్లోని అర్చకులకు ఈ నిర్ణయం వర్తించనుంది. మొత్తంగా 3,203 మంది అర్చకులకు లబ్ధి కలుగుతుందని.. ప్రభుత్వానికి పదికోట్ల రూపాయలు అదనపు భారం పడుతుందని మంత్రి వెల్లడించారు.