ఏపీలోని టీడీపీ కూటమి సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంధన ఆదా దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సీఎం చంద్రబాబు నాయుడు.. విద్యుత్ ఆదా కోసం కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయి ఈఈఎస్ఎల్తో.. ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం రాష్ట్రంలోని లక్షా 50 వేల ఇళ్లకు ఎల్ఈడీ బల్బులు, ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లను సరఫరా చేస్తారు. అయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మిస్తున్న ఇళ్ల లబ్ధిదారులకు వీటిని సరఫరా చేస్తారు.