ఏపీలోని చర్మకారుల కోసం లిడ్ క్యాప్ సరికొత్త ఆలోచన చేస్తోంది. చెప్పులు కుట్టి జీవించే చర్మకారులతో సీబీఎన్ రక్ష ఫుట్‌వేర్ దుకాణాలు ఏర్పాటు చేయిస్తోంది. దాతల సహకారంతో ఈ పథకం చేపట్టింది. సోమవారం 14 మంది లబ్ధిదారులకు వీటిని అందజేశారు. ఒక్కో షాపు విలువ 80 వేలు. దాతల సహకారంతో ఈ షాపులు ఏర్పాటు చేయించి.. చర్మకారులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలనేది లిడ్ క్యాప్ ఆలోచన.