Andhra Pradesh Cabinet Meet On Volunteers: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ఈ నెల 10న అమరావతిలో నిర్వహించబోతున్నారు. అయితే ఈసారి వాలంటీర్ల అంశంపై మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు. వాలంటీర్ల కొనసాగింపు, వారికి గౌరవ వేతనం పెంపు అంశాలపై క్లారిటీ వస్తుందనే ప్రచారం జరుగుతోంది. గత నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వాలంటీర్ల అంశంపై సమీక్ష చేశారు.. అధికారులకు కీలక సూచనలు చేశారు. దీంతో ఈసారి కేబినెట్‌లో నిర్ణయం ఉంటుందని చెబుతున్నారు.