Visakhapatnam Lg Chem Promises Rs 120 Crores: 2020లో జరిగిన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో ప్రభావితం అయిన వారి కుటుంబాలకు ఎల్జీ కెమికల్స్ భారీగా సాయం ప్రకటించింది. మొదటి దశంలో రూ. 60 కోట్ల ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ఈ మొత్తం ముందస్తుగా ఒకేసారి చెల్లించబడుతుంది. అదనంగా, ప్రమాదం వల్ల ప్రభావితమైన వారి సంక్షేమం కోసం ప్రత్యేక ఫౌండేషన్‌కి మరింతగా రూ.60 కోట్లు ఇవ్వడానికి ఎల్జీ కెమ్ కట్టుబడి ఉంది. ఈ చర్యలు ప్రమాదం వల్ల నష్టపోయిన కుటుంబాలకు మేలు జరిగి.. జీవితంలో ముందుకు సాగడానికి సహాయపడతాయని భావిస్తున్నారు.