సాధారణంగా వైన్స్‌లు, బార్లు అంటే ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ వస్తుందా.. ఎప్పుడెప్పుడు అప్లై చేసుకుని లైసెన్స్‌లు దక్కించుకుందామా అని.. చాలా మంది ఎదురుచూస్తూ ఉంటారు. ఇక ప్రభుత్వానికి కూడా బార్లు, వైన్స్‌ల లైసెన్స్‌లతో భారీగా ఖజానాకు ఆదాయం సమకూరుతుంది. కానీ ఏపీలో మాత్రం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ఎక్సైజ్ శాఖ.. బార్ లైసెన్స్‌ల కోసం నోటిఫికేషన్‌ను జారీ చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదు. 80 శాతానికి పైగా బార్లకు ఎవరూ కనీసం దరఖాస్తు చేసుకోకపోవడం గమనార్హం.