Vijayawada Durga Temple In First Place: ఏపీ ప్రభుత్వం ప్రతి నెలా ఇస్తున్న ర్యాంకింగ్స్‌లో విజయవాడ దుర్గ గుడి ప్రథమ స్థానంలో నిలిచింది. భక్తులకు కల్పిస్తున్న సేవల విషయంలో అభిప్రాయాలు తీసుకుంటున్నారు.. ర్యాంకింగ్స్ కూడా ఇస్తున్నారు. జులై, ఆగస్టు నెలల్లో దుర్గమ్మ ఆలయం టాప్‌లో నిలిచింది. జులైలో 74శాతం.. ఆగస్టులో 1.3శాతం పెరిగి 75.3కు చేరింది. ఆలయాల్లో దర్శనం, ప్రసాదాల నాణ్యత, పారిశుద్ధ్యం, తాగునీరు వంటి అంశాలపై అభిప్రాయలు తీసుకుంటున్నారు.