Andhra Pradesh Science Parks: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సరికొత్త ఆలోచన చేస్తోంది. రాష్ట్రంలోని పట్టణాల్లో సైన్స్ పార్కులు ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. విద్యార్థుల్లో సైన్స్ పట్ల ఆసక్తిని పెంచేందుకు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు ఈ సైన్స్ పార్కులు ఉపయోగపడతాయి. అలాగే గతంలో ఆగిపోయిన సైన్స్ సిటీ నిర్మాణానికి మళ్ళీ ఊపిరి పోయనున్నారు.