AP School Students Special Aadhaar Camps: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త. ఆధార్ స్పెషల్ క్యాంపులు మళ్ళీ మొదలయ్యాయి. ఈ నెల 5 నుంచి 9 వరకు స్కూళ్లు, కాలేజీల్లో ఈ క్యాంపులు జరుగుతాయి. మీ ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్ చేయించుకోకపోతే NEET, JEE వంటి పరీక్షలకు ఇబ్బందులు తప్పవు. వెంటనే మీ దగ్గర్లోని క్యాంపుకు వెళ్లి అప్‌డేట్ చేసుకోండి, ఇది పూర్తిగా ఉచితం అని చెబుతున్నారు అధికారులు.