AP School Students Mock Assembly: ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులకు అద్భుత అవకాశం! వచ్చే నెల 26న అమరావతిలో మాక్ అసెంబ్లీ, రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం. వ్యాస రచన, ఉపన్యాసం, క్విజ్ పోటీల ద్వారా ఎంపికైన విద్యార్థులు రాష్ట్ర స్థాయి అసెంబ్లీలో పాల్గొంటారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై అవగాహన పెంచే ఈ కార్యక్రమం విద్యార్థులకు గొప్ప అనుభూతినిస్తుంది. మంత్రి నారా లోకేష్ చొరవతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల అసెంబ్లీలో ఈ విషయాన్ని ప్రకటించారు.