Andhra Pradesh Govt Data City In Visakhapatnam: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐటీ రంగంపై ఫోకస్ పెట్టింది .. రాష్ట్రానికి మరిన్ని కంపెనీలను తీసుకొచ్చే పనిలో ఉంది. అయితే విశాఖపట్నంలో ఐటీని మరింత విస్తరించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. నగరంలో డేటా సిటీని ఏర్పాటు చేయాలని ప్లాన్ చేసింది. 500 ఎకరాల్లో సిటీని ఏర్పాటు చేసి ప్రముఖ కంపెనీల కార్యాలయాలను అక్కడే ప్రారంభించే దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు పలు కంపెనీలతో చర్చించి ఒప్పించింది. డేటా సిటీకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.