ఏపీలోని ఆ జిల్లావాసులకు ప్రభుత్వం నూతన సంవత్సరం కానుక.. జనవరి నుంచి కొత్త పథకం..

7 months ago 16
చిత్తూరు జిల్లావాసులకు శుభవార్త. జనవరి నుంచి చిత్తూరు జిల్లాలో సంజీవని పథకం అమలు కానుంది. ఈ మేరకు సీఎం నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. వైద్యారోగ్యశాఖపై సీఎం చంద్రబాబు శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సంజీవని ప్రాజెక్టు గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. జనవరి నుంచి చిత్తూరు జిల్లాలో సంజీవని ప్రాజెక్టు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా సంజీవని పథకం అమలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సంజీవని పథకం కింద రాష్ట్రంలోని అందరికీ రూ.25 లక్షల వరకూ ఆరోగ్య బీమా అందించనున్నారు.
Read Entire Article