ఏపీకి కేంద్రం శుభవార్త వినిపించింది. ఉపాధి హామీ పనుల కింద ఏపీకి రూ.665 కోట్ల విలువైన మెటీరియల్ కాంపోనెంట్ మంజూరు చేసింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చొరవతో బుధవారం రూ.665 కోట్లు మెటీరియల్ కాంపొనెంట్ కోసం విడుదల చేసింది. ఈ సందర్భంగా కేంద్రానికి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌లకు మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ధన్యవాదాలు తెలియజేశారు. ఉపాది పనులకు అవసరమైన మెటీరియల్ కోసం ఈ నిధులను ఖర్చుచేయనున్నారు.