ఏపీలోని రైతులకు శుభవార్త.. త్వరలోనే కొత్త పాసు పుస్తకాలు.. ఎప్పుడంటే?

8 months ago 30
రాష్ట్రంలోని రైతులకు కొత్త పాసు పుస్తకాలు ఇవ్వనున్నట్లు ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. శుక్రవారం రెవెన్యూ శాఖపై సీఎం నారా చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి.. కీలక వివరాలు వెల్లడించారు. వైసీపీ హయాంలో భూముల రీసర్వే ఇష్టానుసారం జరిగిందన్న ఆయన.. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో పారదర్శకంగా జరుగుతోందన్నారు. ఆగస్ట్ 15న కొత్త పాసు పుస్తకాలు అందించనున్నట్లు వెల్లడించారు.
Read Entire Article