స్వయం సహాయక సంఘాలకు ఉపయోగపడేలా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల నుంచి, స్త్రీనిధి నుంచి రుణాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే రుణ వాయిదాల చెల్లింపుల సమయంలో స్వయం సహాయక సంఘాల సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే అవకతవకలకు ఆస్కారం ఏర్పడుతోంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఏపీ ప్రభుత్వం స్వయం సహాయక సంఘాల రుణ వాయిదాల చెల్లింపు కోసం ప్రత్యేక యాప్ తెచ్చే ఆలోచన చేస్తోంది.