హైదరాబాద్‌లో హైడ్రా ఎంత ప్రకంపనలు రేపుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చెరువుల ఆక్రమణ, కట్టడాల కూల్చివేతల వ్యవహారం హైకోర్టు దాకా వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే ఏపీలోనూ ఇదే తరహా కూల్చివేతలు ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. బుడమేరు వాగు ఆక్రమణల కారణంగా విజయవాడ వరదలు వచ్చాయని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే మరోసారి ఇలాంటి పరిస్థితులు రాకూడదనే ఉద్దేశంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్ బుడమేరు ప్రారంభించాలని నిర్ణయించింది. ఇక శనివారం నెల్లూరు జిల్లాలో పర్యటించిన మంత్రి నారాయణ.. సర్వేపల్లి కాలువ ఆక్రమణలు గురైన విషయాన్ని గుర్తించారు. సర్వేపల్లి కాలువలో అక్రమ కట్టడాలు కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు.