సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ మరోసారి వార్తల్లో నిలిచారు. విశాఖ ఎయిర్‌పోర్టులో బాలయ్య కోపంతో ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అఖండ 2 సినిమా ప్రమోషన్లలో భాగంగా చిత్ర బృందం విశాఖపట్నం వచ్చింది. ఈ సందర్ఫంగా కొంతమంది అభిమానులు విశాఖ విమానాశ్రయంలో బాలకృష్ణను కలిసేందుకు ఉత్సాహం చూపించారు. ఈ సందర్భంగా బాలయ్య ఓ వ్యక్తిపై చిందులు వేశారు. నువ్వెందుకు వచ్చావ్ ఇక్కడకు అంటూ కోపగించుకున్నారు. వెనక్కి వెళ్లు, సాయంత్రం కూడా రాకూడదంటూ కోపం ప్రదర్శించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.