రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిషత్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు మెరుపు దాడులు చేశారు. భవన నిర్మాణ అనుమతుల కోసం ఈదులపల్లికి చెందిన ప్రవీణ్ అనే వ్యక్తిని రూ. 3.5 లక్షలు లంచం డిమాండ్ చేసిన ఎంపీడీవో సుమతి, ఏపీవో తేజ్ సింగ్, కార్యదర్శి చెన్నయ్యలను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఇప్పటికే ఒక లక్ష రూపాయలు వసూలు చేసిన వీరు.. మరో లక్ష రూపాయలు తీసుకుంటుండగా డీఎస్పీ నేతృత్వంలోని బృందం రెడ్ హ్యాండెడ్‌గా నిర్బంధించింది. నిందితులపై కేసు నమోదు చేసి.. కార్యాలయంలోని కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.