తెలంగాణలో సంచలనంగా మారిన ఫార్ములా రూ కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఏసీబీ విచారణకు హాజరయ్యారు. లాయర్‌లో కలిసి విచారణకు హాజరైన కేటీఆర్‌ను ఏసీబీ అధికారులు ఏడు గంటల పాటు ప్రశ్నించారు. విచారణ అనంతరం.. మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఏసీబీ అధికారులు విచారణలో తనను ఎలాంటి ప్రశ్నలు అడిగారన్నది కేటీఆర్ వెల్లడించారు.