ఏసీబీ విచారణకు కేటీఆర్.. బీఆర్ఎస్ శ్రేణుల్లో టెన్షన్

2 weeks ago 2
హైదరాబాద్ ఫార్ములా ఈ-రేసు కేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. హైకోర్టు ఇచ్చిన వెసులుబాటు మేరకు లాయర్ రామచంద్రరావుతో కలిసి ఆయన విచారణకు హాజరయ్యారు. కేటీఆర్ విచారణ నేపథ్యంలో ఏసీబీ కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక విచారణకు హాజరు కావటానికి ముందు నంది నగర్‌లోని నివాసం వద్ద కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తాను స్వచ్చమైన మనసుతో చెబుతున్నానని.. ఎలాంటి తప్పు చేయలేదని అన్నారు. ఫార్ములా కేసులో అర పైసా అవినీతికి పాల్పడలేదని అన్నారు. కాగా, విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. విచారణ తర్వాత ఏం జరగనుందనే దానిపై చర్చించుకుంటున్నారు.
Read Entire Article