హైదరాబాద్ ఐఐటీ మరియు సీఎస్‌ఐఆర్-ఐఐసీటీ శాస్త్రవేత్తలు క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పును తీసుకొచ్చారు. శస్త్రచికిత్స లేదా బాధాకరమైన కెమోథెరపీ అవసరం లేకుండా.. కేవలం కాంతి సహాయంతో క్యాన్సర్ కణాలను నాశనం చేసే 'ఫొటోథర్మల్ థెరపీ'ని వీరు అభివృద్ధి చేశారు. ఈ విధానంలో బంగారు పూత పూసిన నానో కణాలను శరీరంలోకి పంపి.. ప్రత్యేక కాంతిని ప్రసరింపజేస్తారు. ఆ కాంతి వల్ల నానో కణాలు వేడెక్కి, కేవలం క్యాన్సర్ కణాలను మాత్రమే కరిగించి వేస్తాయి. దీనివల్ల సాధారణ కణాలకు ఎలాంటి హాని కలగదు.