AP Senior IPS Madireddy Pratap Felicitated Teachers: ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి, అడిషనల్ డీజీపీ మాదిరెడ్డి ప్రతాప్ ఎమోషనల్ అయ్యారు. తన పదవీ విరమణకు ముందు సొంత ఊరికి వెళ్లి తనకు చదువు చెప్పిన గురువుల్ని ఘనంగా సత్కరించారు. తల్లిదండ్రులు, గురువుల వల్లే తాను ఈ స్థాయికి ఎదిగానన్నారు. చిన్నప్పుడు ఇంటింటికి తిరిగి పాలు పోసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. కష్టపడి చదువుకుని తాను ఐపీఎస్ అయ్యాయనన్నారు.