ఉపాధి కోసం 18 ఏళ్ల క్రితం గల్ఫ్‌కు వెళ్లిన నిర్మల్ జిల్లా దళిత కూలీ ముందల రాజన్న, తనను భారతీయుడినని నిరూపించుకోలేక అక్కడి జైల్లో మగ్గుతున్నాడు. పాస్‌పోర్టు కంపెనీకి ఇవ్వడం, ఆధార్ లేకపోవడంతో స్వదేశానికి రాలేక, పని చేసుకునే అవకాశం లేక ఇబ్బందులు పడుతున్నాడు. కూతురి పెళ్లి చేయాలని, స్వదేశానికి వెళ్లాలని.. అందుకు గాను తనకు ప్రత్యేక ట్రావెలింగ్ డాక్యుమెంట్ ఇవ్వాలని వేడుకుంటున్నాడు రాజన్న. ఈ విషయంపై అతడి భార్య ముఖ్యమంత్రిని కలిసి వినతి పత్రం సమర్పించింది.