ఒంగోలులో అక్రమ నిర్మాణాలపై నగరపాలక సంస్థ కొరడా ఝళిపించింది. గడువు దాటినా చాలామంది యజమానులు ముందుకు రాకపోవడంతో, నోటీసులు ఇచ్చి, భవనాలకు రెడ్ మార్క్ వేస్తున్నారు. సుమారు 6 వేల అక్రమ నిర్మాణాలు ఉండగా, 3 వేల మందికి నోటీసులు అందాయి. గడువులోగా క్రమబద్ధీకరించుకోకపోతే కూల్చివేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. ఈ పథకం ద్వారా రూ.70 కోట్లు ఆదాయం వస్తుందని అంచనా.