ఒంగోలులో తొలి ఫైవ్ స్టార్ హోటల్‌కు మంత్రి నారా లోకేష్ భూమి పూజ చేశారు. రూ.100 కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న రాడిసన్ 5 స్టార్ హోటల్‌ను రవిశంకర్ గ్రూప్, రవిప్రియ హాస్పిటాలిటీస్ ఎల్‌ఎల్‌పీ సంయుక్త భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్టు చేపడుతున్నారు. 151 గదులతో పాటు మల్టీ క్యూసిన్ రెస్టారెంట్, బార్, లాంజ్, స్విమ్మింగ్ పూల్, స్పా, ఫిట్‌నెస్ సెంటర్ వంటి సౌకర్యాలు ఉండనున్నాయి. బిజినెస్ టూరిజం కోసం బ్యాంకెట్ హాళ్లు, కాన్ఫరెన్స్ రూమ్‌లు ఏర్పాటు చేయనున్నారు.