Guinness World Records: ప్రతి ఒక్కరికీ ఏదో ఓ హాబీ ఉండనే ఉంటుంది. అయితే.. హైదరాబాద్‌కు చెందిన ఓ ఫ్యామిలీ మాత్రం.. గిన్నిస్ వరల్డ్ రికార్డులు సృష్టించటమే హాబీగా పెట్టుకుంది. సాధారణంగా ఎవరైనా తమ విభిన్నమై టాలెంట్‌తోనో, సాహసంతోనో.. ఒకటో రెండో.. ఇంకా అంటే మూడో గిన్నిస్ రికార్డులు సృష్టిస్తుంటారు. కానీ.. ఈ ఫ్యామిలీ మాత్రం ఏకంగా 20 గిన్నిస్ వరల్డ్ రికార్డులు సృష్టించి.. అందరిని అబ్బురపరుస్తున్నారు. అయితే.. ఈ అబ్బురం ఎక్కడో కాదు హైదరాబాద్‌లోనే.