హైదరాబాద్ నగరం నుంచి తీర్థయాత్రలకు వెళ్లాలనుకునే వారికి సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు తీపి కబురు చెప్పారు. యాత్రికుల కోసం సర్క్యులేటింగ్ జర్నీ టికెట్ సౌకర్యం కల్పిస్తున్నారు. ఈ మేరకు సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి రైల్వే స్టేషన్ల నుంచి 19 యాత్రలు అందుబాటులో ఉంచారు. అందుకు సంబంధించిన వివరాలు ఈ కథనంలో చూడొచ్చు.