రాష్ట్రంలో 22ఏ నిషేధిత భూమల జాబితా వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భూములు 22ఏ జాబితాలో చేరటంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి భూ యజమానులు, రియల్ ఎస్టేట్ వర్గాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఇష్యూపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక కామెంట్స్ చేశారు. 22ఏ జాబితాలోని లొసుగుల వెనుక కుట్ర దాగి ఉండొచ్చునని, ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. త్వరలోనే ఈ వివాదంపై సమగ్ర విచారణ జరిపిస్తాన్నారు.