పోలవరం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు యువతులు ఆత్మహత్యలకు పాల్పడటం సంచలనం రేపుతోంది. వారిద్దరూ ఒకే యువకుడిని ప్రేమించగా.. వారి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలోనే ప్రియుడు తనకు దక్కడని భావించి ఒక యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలోనే 4 రోజుల వ్యవధిలోనే మరో యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనలపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.