వినాయక నిమజ్జనంలో తీవ్ర విషాదం.. చెరువులో పడి ఆరుగురు విద్యార్థులు మృతి

6 hours ago 2
సంగారెడ్డి జిల్లాలో వినాయక నిమజ్జనం సందర్భంగా తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గణేశ్ విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు చెరువు వద్దకు వెళ్లిన ఆరుగురు విద్యార్థులు ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మృతి చెందారు. నిమజ్జనం సమయంలో చెరువులోకి దిగిన విద్యార్థులు లోతును అంచనా వేయలేకపోయినట్లు తెలుస్తోంది. ఒకరిని రక్షించేందుకు మరొకరు ప్రయత్నించడంతో.. అంతా అందులోకి జారిపోయి.. ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఆరుగురు మృతులను శిరీష చారిటబుల్ ట్రస్ట్‌కు చెందిన విద్యార్థులుగా గుర్తించారు.
Read Entire Article