ప్రజాస్వామ్యంలో ఒక్క ఓటు ఎంతో కీలకం. తెలంగాణలో తాజాగా వెలువడిన సర్పంచ్ ఎన్నికల ఫలితాలు ఈ ఓటు విలువను నిరూపించాయి. తొలి విడత పోలింగ్‌లో అనేకచోట్ల ఫలితాలు ఉత్కంఠభరితంగా వచ్చాయి. మహబూబాబాద్‌లో 9 ఓట్ల తేడాతో.. జగిత్యాలలో 12 ఓట్ల తేడాతో అభ్యర్థులు గెలుపొందారు. యాదాద్రి భువనగిరిలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి కేవలం 14 ఓట్ల స్వల్ప తేడాతో విజయం సాధించారు. ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన ప్రాధాన్యతను ఈ ఫలితాలు స్పష్టం చేశాయి.