కంటికి రెప్పలా కాపాడుకుంటున్నా తన కూతురికి కంట్లో నలక పడి విలవిల్లాడుతుంటే.. తమ గుండెలో గునపం గుచ్చుకున్నంతగా బాధపడ్డారు. హుటాహుటిన ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించి.. తమ కూతురికి ఆ బాధ నుంచి ఉపశమనం కలిగించాలని ఎంతగానో ఆరాటపడ్డారు. కానీ.. విధి ఆడిన నాటకమో, వైద్యులు చూపిన నిర్లక్ష్యమో కారణమేదైనా.. ఆ తల్లిదండ్రులకు మాత్రం నిజంగానే గుండెల్లో గునపం దిగినంకంటే మించిన కడుపుకోత మిగిలింది. ఈ ఘటన హైదరాబాద్‌లో జరిగింది.