కట్టు బొట్టు మార్చిన కవిత.. ఆ లేడీ పొలిటీషియన్‌ను గుర్తుకు తెచ్చేలా..!

4 months ago 8
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె.. కల్వకుంట్ల కవిత బీఆర్‌ఎస్‌ నుంచి బయటకు వెళ్లిన తర్వాత.. రాజకీయంగా తన శైలిని మార్చుకున్నారు. ఆమె కట్టుబొట్టు, పబ్లిక్ అప్పియరెన్స్‌ జయలలితను పోలి ఉన్నాయనే చర్చ నడుస్తోంది. గెలుపే లక్ష్యంగా బలమైన మహిళా నాయకురాలిగా నిలదొక్కుకునేందుకు ఆమె ఈ వ్యూహాత్మక అడుగులు వేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. జాగృతి జనం బాట యాత్రలో పాల్గొంటూ.. మహిళా సాధికారత, బీసీ రాజ్యాధికారం అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఇది ఆమె రాజకీయ భవిష్యత్తుకు కొత్త కోణాన్ని ప్రతిబింబిస్తోంది.
Read Entire Article