Kadapa Three Members Family Suicide: కడప రైల్వే స్టేషన్ సమీపంలో దారుణం చోటుచేసుకుంది. గూడ్స్ రైలు కిందపడి భార్యాభర్తలు, ఏడాదిన్నర చిన్నారితో సహా ఒకే కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం రాత్రి ఈ దారుణం జరిగింది.. చనిపోయిన ఆ ముగ్గురి వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు, ప్రొద్దుటూరులో ప్రభుత్వ ఉద్యోగి కొండపల్లి గొంగన్న పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రెండు ఘటనలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.