ప్రకాశం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ బాలికపై ఆమె తండ్రే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో 12 ఏళ్ల బాలిక మీద ఆమె తండ్రి అత్యాచారానికి ఒడిగట్టాడు. బాలిక కడుపునొప్పిగా ఉందని చెప్పటంతో బాలిక తల్లి ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అసలు దారుణం వెలుగులోకి వచ్చింది. దీంతో బాలిక తల్లి.. కొండపి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు.