కమెడియన్ సప్తగిరి దెబ్బకు.. పారిపోయిన భక్తులు.. కారణం ఏంటంటే..

3 weeks ago 4
చిత్తూరు జిల్లా పుంగనూరులో సుగుటూరు గంగమ్మ జాతర ఘనంగా జరుగుతోంది. మంగళవారం ప్రారంభమైన జాతర బుధవారం వరకూ జరిగింది. జాతర సందర్భంగా స్థానికంగా ఉన్న ప్యాలెస్‌ ఆవరణ భక్తులతో నిండిపోయింది. గంగమ్మ జాతర సందర్భంగా కమెడియన్ సప్తగిరి హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపించారు. గంగమ్మ ఆలయంపై సప్తగిరి హెలికాప్టర్ ద్వారా పూలు చల్లారు. ఈ నేపథ్యంలో భక్తులు భయపడి అక్కడ నుంచి పారిపోయారు. అక్కడ భక్తుల కోసం వేసిన షామియానాలు కూడా కూలిపోయాయి. అక్కడ దుమ్ము, ధూళి కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు భక్తులు. అమ్మవారి దర్శనం కోసం వచ్చిన మాకు ఏమిటి ఈ బాధలు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
Read Entire Article