ఆంధ్రప్రదేశ్‌లో కల్తీ మద్యం వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కల్తీ మద్యం తయారీ, విక్రయాలను అరికట్టేందుకు ఏపీ ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేస్తోంది. అందులో భాగంగా మద్యం తయారీకి సంబంధించిన వివరాలు తెలియజేసేలా APTATS యాప్ అందుబాటులోకి తేనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు. గతంలో ప్రతి బాటిల్ మీద క్యూఆర్ కోడ్ ఉండేదని.. దాన్ని స్కాన్ చేస్తే వివరాలు తెలిసేవన్నారు. అలాంటి ఏర్పాట్లు చేయనున్నట్లు మంత్రి వివరించారు.