కల్తీ మద్యం తయారీ, విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మంత్రులు, అధికారులతో సమావేశమైన చంద్రబాబు.. కల్తీ మద్యం తయారుచేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలవి స్పష్టం చేశారు. ఈ విషయంలో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అలాగే రాజకీయ ప్రయోజనాల కోసం కల్తీ మద్యం విషయంలో అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారన్న చంద్రబాబు.. తప్పుడు ప్రచారాలు చేస్తే న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కల్తీ మద్యం కేసు అప్ డేట్స్‌ను అధికారులు చంద్రబాబుకు వివరించారు.